GNTR: వేమూరు మండలం జంపనిలో విద్యుత్ ప్రమాదం చోటుచేసుకుంది. పొలంలో మందు పిచికారీ చేసేందుకు వెళ్లిన ఇద్దరు వ్యవసాయ కూలీలు తెగిపడిన విద్యుత్ తీగ తగిలి షాక్‌కు గురయ్యారు. ఒకరు తీవ్రంగా గాయపడగా, అతడిని రక్షించేందుకు వెళ్లిన సురేష్ బాబు కూడా విద్యుత్ షాక్‌కు గురయ్యారు. స్థానికులు సురేష్ బాబును తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ.. ఇద్దరికి షాక్


