KMR: యువత భవిష్యత్తును, కుటుంబాల ఆనందాన్ని, సమాజ అభివృద్ధిని దెబ్బతీస్తున్న మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇవాళ చిన్న మల్లారెడ్డిలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గం, ఆదర్శ పూర్వ విద్యార్థుల కమిటీ సభ్యులు, యువత, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
తెలంగాణ
చిన్న మల్లారెడ్డిలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ


