హైదరాబాద్: 28°C
తెలంగాణ

మినీ స్టేడియంలో విద్యుత్ లైట్ల ఏర్పాటు

WGL:నర్సంపేట పట్టణ మినీ స్టేడియంలో సోలార్ లైట్ల బ్యాటరీలు పాడై వాకర్లు, క్రీడాకారులు చీకట్లో ఇబ్బంది పడుతున్నారని మున్సిపల్ కమిషనర్ ఏఈ చంద్రమౌళికి తెలపగా 300 మీటర్ల వైరుతో 10 లైట్లు అమర్చారు. పాత సోలార్ స్టాండ్లు, విద్యుత్ పోళ్లకు లైట్లు బిగించి వెలుగులు అందించారు. వేముల సంధ్యా సాంబయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.