హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు: ASP

CTR: కుప్పం నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో అన్ని నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఏఎస్పీ హేమంత్ తెలిపారు. నాలుగు మండలాల పరిధిలోని నామినేషన్ కేంద్రాల వద్ద 200 మందికి పైగా పోలీసులతో భద్రత కల్పిస్తున్నామన్నారు. ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పోలీసు శాఖ అన్ని చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు.