VZM: చిట్టంపాడుకు చెందిన కుమారికి పురిటి నొప్పులు రావడంతోకుటుంబ సభ్యులు డోలీ సాయంతో కొండ మార్గంలో సుమారు 10 కిలోమీటర్లు మోసుకుంటూ కిందకు తీసుకొచ్చారు. రహదారి సదుపాయం లేక గిరిజనులు అత్యవసర సమయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గర్భిణికి తప్పని డోలీ ప్రయాణం


