హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బిర్సా ముండా జయంతి వేడుకలు

PPM: భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పోస్ట్‌మెట్రిక్ బాలుర వసతి గృహంలో గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా 151వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి ఏ.గంగారావు మాట్లాడుతూ.. జల్, జంగల్, జమీన్ హక్కుల కోసం బ్రిటిష్ పాలకులపై పోరాటం చేశారు.