హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నామినేషన్లకు పోలీసులు పటిష్ట బందోబస్తు

ప్రకాశం: సింగరాయకొండలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాలైన పంచాయతీ కార్యాలయాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.