హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

70 ఏళ్ల చరిత్రను తిరగరాసి ఏకగ్రీవం

కోనసీమ: అమలాపురం రూరల్ మండలం, ఇందుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నాగిరెడ్డి తాతారావును గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక ఏ1 కన్వెన్షన్ హాలులో అన్ని వర్గాల ప్రజలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 1955లో పంచాయతీ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఏకగ్రీవ ఎన్నిక జరిగిన దాఖలాలు లేవని, 70 చరిత్రను ఈ ఎన్నిక తిరగరాసిందని గ్రామస్తులు అంటున్నారు.