హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మంత్రాలయంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

KRNL: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంత్రాలయం పట్టణంలో ఆదివారం ఉదయం పోలీసులు ఫ్లాగ్ మార్చ్, కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఎమ్మిగనూరు డీఎస్పీ పర్యవేక్షణలో సీఐ గిరిబాబు, ఎస్సైలు విజయకుమార్, మల్లికార్జున తనిఖీలు చేపట్టి పత్రాలు లేని 30 వాహనాలను సీజ్ చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ.. ప్రజలకు అవగాహన కల్పించారు.