హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం

AKP: ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు వద్ద వరాహనదిలో నిన్న గల్లంతైన యువకులు మృతి చెందారు. వీరి మృతదేహాలు ఆదివారం ఉదయం లభించాయి. అదే గ్రామానికి చెందిన ముప్పిడి వంశీ (20),కోడి గణేష్ (20), కాతేటి రుషి(18)తో పాటు మరో ముగ్గురు ఈతకు దిగారు. వీరిలో ఈ ముగ్గురు గల్లంత కాగా మరో ముగ్గురు బయటపడ్డారు. సీఐ రామకృష్ణ, ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు గాలించారు.