హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ సీటుపై టీడీపీ నేతల మధ్య పోటీ!

ELR: ఉంగుటూరు గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిత్వంపై కూటమిలో ఇద్దరు టీడీపీ నేతల మధ్య పోటీ నెలకొంది. మాజీ ఉపసర్పంచ్ పాతూరి జగదీష్, ఏలూరు టీడీపీ జిల్లా యువజన అధ్యక్షుడు రెడ్డి చందు సర్పంచ్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏపీ ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు వద్ద జరిగిన పంచాయితీలోనూ ఇంతవరకు ఏకాభిప్రాయం కుదరకపోవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.