హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిలకడగా రాప్తాడు దాడి నిందితుడి ఆరోగ్యం

ATP: కర్నూలు జీజీహెచ్ ఐసీయూలో రాప్తాడు దాడి నిందితుడు హేమంత్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పల్మనరీ ఎంబాలిజం, ఆయాసంతో బాధపడుతున్న అతనికి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం చికిత్స చేస్తోంది. ప్రస్తుతం ప్రాణాపాయం లేదని, ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సాయుధ పోలీసుల కాపలాలో చికిత్స కొనసాగుతోంది.