హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దరఖాస్తుల స్వీకరణ

TPT: వ్యవసాయ సహకార పరపతి సంఘం సభ్యత్వం కోసం రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని సత్యవేడు సింగిల్ విండో సీఈవో సురేష్ బాబు తెలిపారు. వ్యవసాయ పరపతి సంఘంలో సభ్యత్వం కోసం అర్హులైన రైతులు రూ.330 చెల్లించాలని తెలిపారు. ఇందులో రూ. 300 సభ్యత్వం కోసం, రూ.30 అడ్మిషన్ రుసుంగా ఉంటుందన్నారు. వచ్చే ఏడాది జనవరిలో వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నయన్నారు.