హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్తీక మాసం ఎఫెక్ట్.. తగ్గిన మాంసం డిమాండ్

ATP: కార్తీక మాసం ప్రభావంతో అనంతపురం జిల్లాలో మాంసం విక్రయాలు తగ్గాయి. మాసం ఆచారాలను పాటిస్తూ చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో చికెన్ ధర రూ.220-240, చేపలు రూ.150-300, మటన్ రూ.700-800 పలుకుతోంది. డిమాండ్ తగ్గడంతో మాంసం వ్యాపారాలు మందగించాయి.