హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోడిపందాల స్థావరంపై దాడి.. 9 మంది అరెస్ట్

E.G: కోరుకొండ మండలంలోని శ్రీరంగపట్నం శివారున కోడిపందేలు నిర్వహిస్తున్న స్థావరంపై శనివారం పోలీసులు దాడిచేశారు. ఈ దాడిలో 9 మందిని అదుపులోకి తీసుకున్నామని ఎస్సై ఆర్. శివాజీ తెలిపారు. వీరి నుంచి రూ.20 వేల నగదు, 2 కోడిపుంజులు, 2 కత్తులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు చేపడితే చర్యలు తప్పమన్నారు.