హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూలు SP స్ట్రాంగ్ వార్నింగ్!

KRNL: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సమయంలో నియమావళి పాటించాలని కర్నూలు SP విక్రాంత్ పాటిల్ సూచించారు. అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే కేంద్రంలోకి అనుమతి ఉంటుందన్నారు. ర్యాలీలు, ఊరేగింపులు నిషేధమని చెప్పారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 163 BNSS అమలులో ఉన్నాయని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.