హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాలకొండ ఆలయానికి భారి ఆదాయం

ప్రకాశం: వలేటివారిపాలెం మండలంలోని మాలకొండ లక్ష్మీనరసింహస్వామిని చూసి తరించేందుకు పలు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. శనివారం సందర్భంగా అర్చకులు లక్ష్మీనరసింహస్వామి, లక్ష్మీదేవి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ఆలయానికి ఒక్క రోజు వివిధ రూపాల్లో రూ.10,80,276 ఆదాయం సమకూరినట్లు ఈవో పి.శ్రీనివాసులురెడ్డి తెలిపారు.