హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగన్నాధపురంలో సీఐ పల్లె నిద్ర

VZM: బొబ్బిలి CI నారాయణరావు శనివారం రాత్రి స్దానిక జగన్నాధపురంలో పల్లెనిద్ర చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో సమావేశం నిర్వహించి చట్టాలపై అవగాహన కల్పించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సహకరించాలని, అల్లర్లు,గొడవలకు పాల్పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి, మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని మహిళల పట్ల గౌరవంగా ఉండాలని కోరారు.