ASR: మన్యంలో దట్టమైన పొగమంచు పర్యాటకులను ఆకట్టుకుంటోంది.చింతపల్లి మండలంలోని పర్యాటక ప్రాంతాలన్నీ శనివారం పర్యాటకులతో సందడిగా మారాయి. లంబసింగి, తాజంగి, చెరువులవెనం ప్రాంతాలకు కుటుంబసమేతంగా చేరుకున్న సందర్శకులు మంచు అందాలను తిలకిస్తూ చలిని ఆస్వాదించారు. ప్రకృతి అందాల నడుమ ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ ఆనందంగా గడిపారు.
ఆంధ్రప్రదేశ్
పర్యాటకులతో కళకళలాడిన లంబసింగి


