హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం

AKP: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో అనకాపల్లిలో రేపు మినీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. పట్టణంలోని సాయి కుల్వంత్ డిగ్రీ కళాశాలలో ఈ జాబ్ మేళా జరగనుంది. పదో తరగతి నుంచి బీటెక్ వరకు విద్యార్హత కలిగిన 30 ఏళ్లలోపు యువతీ యువకులు ఈ ఉద్యోగ మేళాకు హాజరుకావచ్చని నిర్వాహకులు తెలిపారు.