హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాలీబాల్ టోర్నీ విజేతగా మంగళకర డిగ్రీ కళాశాల

SS: శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో గుంతకల్లు ఎస్కేపీ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఇంటర్ కాలేజియేట్ పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ శనివారం ముగిసింది. శుక్ర, శనివారాల్లో జరిగిన ఈ పోటీల ఫైనల్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టుపై జగరాజుపల్లికి చెందిన మంగళకర డిగ్రీ కళాశాల జట్టు విజయం సాధించి విన్నర్‌గా నిలిచింది.