హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

ATP: పెద్దపప్పూరు మండలంలోని అమ్మలదిన్నె, కొత్తపల్లి గ్రామాల మీదుగా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో నిర్వహించిన తనిఖీల్లో 60 సంచులలోని 32.5 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, తదుపరి చర్యల నిమిత్తం రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు ఎస్సై నరసింహారెడ్డి శనివారం తెలిపారు.