హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఒడిశా సీఎం మోహన్ చరణ్ రాక

VZM: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇవాళ ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝి రానున్నారు. మధ్యాహ్నం 2.50 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆయన చేరుకుంటారు. అక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయనకు స్వాగతం పలుకుతారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో గమ్యస్థానానికి పయనమవుతారు. పోలీసులు విమానాశ్రయం పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు చేశారు.