TPT: చంద్రగిరి మండలం పనపాకం సమీపంలో జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ముందు వెళ్తున్న టిప్పర్ను వెనుక నుంచి సుమో ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. క్షతగాత్రులను తిరుపతి ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి స్పాట్ డెడ్


