అన్నమయ్య: గుర్రంకొండ పంచాయతీలో జిల్లా SPధీరజ్ ఆదేశాల మేరకు గుర్రంకొండ ఎస్సై రవీంద్ర విస్తృతంగా పర్యటించారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు గ్రామస్థులతో సమావేశమై శాంతిభద్రతలపై అవగాహన కల్పిస్తున్నారు. ఓటర్లు ప్రలోభాలు, బెదిరింపులకు లొంగకుండా నిర్భయంగా ఓటు వేయాలని సూచించారు. నియమాలు ఉల్లంఘించినా,అల్లర్లకు పాల్పడినా కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల వేళ గొడవలకు దూరంగా ఉండాలి: SP


