KDP: తమకు రక్షణ కల్పించాలని చాపాడు పోలీసులను ఓ ప్రేమజంట శనివారం ఆశ్రయించింది. వీరిద్దరు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పడంతో విశ్వనాథపురం వీరాంజనేయ స్వామి ఆలయంలో వారు వివాహం చేసుకున్నారు. తమ కుటుంబాల నుంచి ప్రాణహాని ఉందని వారు చాపాడు SI చిన్న పెద్దయ్యకు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట


