హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శివమణిని పరామర్శించిన మాజీమంత్రి

PLD: చిలకలూరిపేటలో 32వ వార్డు వైసీపీ అధ్యక్షుడు షేక్ దరియావలి (శివమణి) ఇటీవల గుండె శస్త్రచికిత్స చేయించుకుని గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి విడదల రజిని ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.