హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ప్రవీణ ఎంపిక

SKLM: జి.సిగడాం మండలం ఎందువ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి అడ్డాకుల ప్రవీణ అండర్-14 విభాగంలో జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం అరుణ, వ్యాయామ ఉపాధ్యాయుడు రామారావు తెలిపారు. ప్రవీణ్ ఈనెల 10న పాడేరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపాడని చెప్పారు. జాతీయ పోటీల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు అభినందించారు.