హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం

SKLM: నరసన్నపేట మండలం కోమర్తి కూడలి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కింజరాపు రాజారావు(49) మృతి చెందారు. పులివెందులలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆయన పనులపై స్వగ్రామానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనంపై విశాఖపట్నం వెళ్తుండగా లారీ ఢీకొంది. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎస్సై గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.