హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

కృష్ణా: కేసరపల్లి సబ్‌స్టేషన్‌లో నిర్వహణ పనుల కారణంగా ఇవాళ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ విశ్వేశ్వర ప్రసాద్ తెలిపారు. కేసరపల్లి, ఎస్‌ఎల్ విల్లాస్, జక్కులనెక్కలం హౌసింగ్ కాలనీ, కేసరపల్లి హౌసింగ్ కాలనీ, ఉప్పులూరు రోడ్డు, అప్పారావుపేట, బుద్ధవరం, అర్జంపూడి, బూతుమిల్లిపాడు ప్రాంతాల్లో కరెంట్ ఉండదని అన్నారు.