హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీచ్ రోడ్డులో ఆకస్మిక దాడులు

విశాఖ బీచ్ రోడ్డులో పౌరసరఫరాల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి భాస్కర్ ఆదేశాలు మేరకు సహాయ పౌర సరఫరాల అధికారి కళ్యాణి పర్యవేక్షణ లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ బీచ్ రోడ్డులోని శారద బేకరీపై దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బేకరీలో గృహ వినియోగానికి కేటాయించిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.