హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 20న పుట్టపర్తికి ప్రత్యేక రైలు

SKLM: సత్యసాయిబాబా శతాబ్ది జయంతి ఉత్సవాలకు భక్తులకు శుభవార్త. ఆమదాలవలసలోని శ్రీకాకుళం రోడ్డు స్టేషన్ నుంచి ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు పెద్దమందిరం కన్వీనర్ మురళీకృష్ణ తెలిపారు. ఈ రైలు 20న సాయంత్రం 4 గంటలకు బయల్దేరి పుట్టపర్తి చేరుతుంది. 24న తిరిగి వస్తుంది. భక్తులకు ఉచిత భోజన, వసతి సదుపాయాలు ఉంటాయని, 92904 31611 నంబరును సంప్రదించాలని కోరారు.