హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడ ఓల్డ్ GGH నుంచి యువకుడి అదృశ్యం

NTR: కృష్ణలంకలోని బాలాజీనగర్‌కు చెందిన షేక్ సిద్ధార్థ (19) అదృశ్యమయ్యాడు. ఓల్డ్ ప్రభుత్వ ఆసుపత్రిలో డైట్ విభాగంలో కాంట్రాక్ట్ లేబర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 9వ తేదీ స్నేహితుడికి చెప్పి బ్యాగ్ తీసుకొని ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లాడు. అప్పటి నుంచి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.