హైదరాబాద్: 28°C
వార్తలు

తుది దశకు భారత్-అమెరికా ట్రేడ్ డీల్

భారత్-అమెరికా మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఈ ఒప్పందం కింద వియత్నాం, బంగ్లాదేశ్, కంబోడియా వంటి పోటీ దేశాలతో పోలిస్తే భారత ఎగుమతులపై తక్కువ దిగుమతి సుంకాలు కల్పిస్తామని అమెరికా హామీ ఇచ్చినట్లు సీనియర్ ప్రభుత్వం అధికారి వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఒప్పందంలోని మొదటి విడతను పూర్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.