హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం సభలో ఎమ్మెల్యే అనుచరుల రచ్చ!

ఉత్తరాఖండ్ పిథోరాగఢ్‌లోని ప్రసిద్ధ జౌల్‌జీబీ జాతర ప్రారంభ కార్యక్రమానికి CM పుష్కర్ సింగ్ ధామీ హాజరయ్యారు. ఆ వేదికపై మాట్లాడే అవకాశం స్థానిక MLA హరీశ్ ధామీకి ఇవ్వలేదు. దీంతో అలిగిన MLA, ఆయన అనుచరులు నిరసనకు దిగారు. అనుచరులు కార్యక్రమ ప్రాంగణంలో వస్తువులు ధ్వంసం చేసి, సౌండ్ సిస్టమ్ సిబ్బందిని కొట్టారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.