ఎన్సీపీ రెండు వర్గాల విలీన చర్చలు అజిత్ పవార్ మరణంతోనే పూర్తిగా ముగిశాయని ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే స్పష్టం చేశారు. ఆయన మరణం తర్వాత అటువైపు నుంచి తమను ఎవరూ సంప్రదించలేదన్నారు. ఎన్డీయే కూటమిలో చేరతామంటూ వస్తున్న ఊహాగానాలను ఆమె కొట్టిపారేశారు. వ్యక్తిగత బంధాలను రాజకీయాలతో ఎప్పుడూ కలపకూడదని సుప్రియా సూలే తేల్చిచెప్పారు.
వార్తలు
ఎన్సీపీ వర్గాల విలీనం లేనట్లే: సుప్రియా సూలే


