హైదరాబాద్: 28°C
వార్తలు

బోడుప్పల్లో అక్రమ షెడ్ల కూల్చివేత

MDCL: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్‌లో అక్రమ నిర్మాణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన షెడ్లను జేసీబీ సహాయంతో కూల్చివేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలపై తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.