హైదరాబాద్: 28°C
వార్తలు

బర్డ్ ఫ్లూ: చికెన్ తినొచ్చా?

తమిళనాడు కడలూరు జిల్లాలో H5N1 బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 30 నుంచి ఇప్పటివరకు 35,647 కోళ్లు మృతి చెందగా, 1,550 కోళ్లను చంపేశారు. 1 కి.మీ. పరిధిలో కల్లింగ్ కొనసాగుతోంది. కోళ్ల రవాణాపై ఆంక్షలున్నాయి. ఇన్ఫెక్షన్ ఆ ప్రాంతానికే పరిమితమైందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని పశుసంవర్ధక శాఖ స్పష్టం చేసింది.