హైదరాబాద్: 28°C
వార్తలు

భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక సౌకర్యం

BDK: కార్తీక మాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం కొత్తగూడెం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. ప్రతి ఆదివారం రాత్రి 8.30 గంటలకు డిపో నుంచి అన్నవరం, పంచారామాలకు బస్సులు బయలుదేరుతాయని డిపో మేనేజర్ యు.రాజ్యలక్ష్మి తెలిపారు. సోమవారం ఉదయం భక్తులు దర్శనం చేసుకోవచ్చని, కార్తీక పౌర్ణమికి కూడా ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.