హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 18న దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర మహాసభ

SRD: దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర మహాసభ ఈనెల 18న సంగారెడ్డిలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు తలారి యాదగిరి చెప్పారు. సంగారెడ్డిలో కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. దళిత జర్నలిస్టులు అధిక సంఖ్యలో మహాసభలకు హాజరై ఐక్యత చాటాలని తెలిపారు. జర్నలిస్టుల సమస్యలపై సమావేశంలో చర్చిస్తామని పేర్కొన్నారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అశోక్ పాల్గొన్నారు.