హైదరాబాద్: 28°C
తెలంగాణ

సొంత భూమిలో రోడ్డు నిర్మాణంపై ఆవేదన

NZB: మెండోరా మండలం బుస్సాపూర్‌లో తమ పట్టా భూమిలో అనుమతి లేకుండా రోడ్డు వేయాలని కొందరు వ్యక్తులు, అధికారులు ప్రయత్నిస్తున్నారని సోమ గంగవ్వ, సోమ అనిల్ ఆరోపించారు. నోటీసులు ఇవ్వకుండా జేసీబీతో రాళ్లు తొలగించారని తెలిపారు. కలెక్టర్, డీపీఓ స్పందించి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ప్రెస్‌క్లబ్‌లో కోరారు.