హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలకుర్తిలో ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పింఛన్ల పంపిణీ

PDPL: పాలకుర్తి మండలం జీడీనగర్‌లోని జీఎంఆర్ గార్డెన్స్‌లో ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ 354 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, 603 మందికి చేయూత పింఛన్లు అందజేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పేదల సొంతింటి కల నెరవేర్చడంతో పాటు వృద్ధులు, దివ్యాంగులందరికి ఫించన్లు కల్పిస్తామని పేర్కొన్నారు.