హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెట్పల్లి జాబ్ మేళాలో 750 మందికి ఉద్యోగ అవకాశాలు

JGL: మెట్‌పల్లి పట్టణంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ మేళాకు 1,500 మందికి పైగా నిరుద్యోగ యువతీ యువకులు హాజరుకాగా, సుమారు 750 మందికి ఉద్యోగ అవకాశాలు లభించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమన్నారు.