హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సీపీఎస్ రద్దు కోసం సామూహిక సెలవు'

NGKL: సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 17న రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు సామూహిక సెలవు పెట్టి నిరసన తెలపాలని TSCPSEU జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనరసింహారావు పిలుపునిచ్చారు. కల్వకుర్తి TNGO భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని శాఖల సీపీఎస్ ఉద్యోగులు నిరసనలో పాల్గొనాలన్నారు.