హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు

SRD: పటాన్‌చెరు మండలం రుద్రారం గణేష్ గడ్డలోని శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో శనివారం శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రత పూజలు వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భక్తులు దంపతుల సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు