SRCL: భూముల రీసర్వే ప్రక్రియను రైతుల సమక్షంలోనే పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. శనివారం వేములవాడ రూరల్ మండలం జయవరంలో కొనసాగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోవర్ యంత్రాలు, డిజిటల్ పరికరాలతో చేపడుతున్న సర్వే తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
తెలంగాణ
'రైతుల సమక్షంలోనే భూముల రీసర్వే చేపట్టాలి'


