MHBD: గర్భస్థ శిశువు లింగ నిర్ధారణను అరికట్టేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శనివారం తొర్రూరులోని పలు స్కానింగ్ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ బి. రవి రాథోడ్ ఆధ్వర్యంలో ఫారం-ఎఫ్ రికార్డులు, స్కానింగ్ యంత్రాలు, ఇతర వైద్య రికార్డులను పరిశీలించారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కేంద్రాల నిర్వాహకులకు సూచించారు.
తెలంగాణ
స్కానింగ్ కేంద్రాల్లో డీఎంహెచ్ఓ తనిఖీలు


