హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు పనులు ప్రారంభించాలని BRS పాదయాత్ర

BHPL: మహాదేవపూర్ మండలంలోని పలుగుల–కుంట్లం రోడ్డు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ BRS నాయకులు శనివారం పాదయాత్ర నిర్వహించారు. రూ. 22 కోట్లతో శంకుస్థాపన చేసి 8 నెలలైనా పనులు ప్రారంభించలేదని విమర్శించారు. ప్రభుత్వం, మంత్రి శ్రీధర్ స్పందించి వెంటనే పనులు చేపట్టాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.