హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: డెలివరీ ఆటోలో అగ్నిప్రమాదం

SRPT: మునగాల మండలంలోని మాదారం గ్రామ ప్రవేశం వద్ద శనివారం షార్ట్‌సర్క్యూట్ కారణంగా డెలివరీ ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సూర్యాపేట నుంచి మునగాల వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు వ్యాపించడంతో ఆటో పూర్తిగా దగ్ధమైంది. ఆటోలో ప్రయాణిస్తున్న డెలివరీ సిబ్బంది యువకులు సురక్షితంగా బయటపడటంతో ప్రాణాపాయం తప్పింది.