కరీంనగర్ నగరంలో జోరుగా సాగుతున్న గంజాయి, హుక్కా, మట్కా, పేకాట స్థావరాలపై ఉక్కుపాదం మోపాలని సీపీఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం డిమాండ్ చేశారు. మత్తు, జూదం వల్ల యువత పెడదారి పట్టడంతో పాటు కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని నగరాన్ని డ్రగ్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు.
తెలంగాణ
గంజాయి, మట్కాపై ఉక్కుపాదం మోపాలి: సీపీఎం


